వార్తలకు తిరిగి వెళ్లండి

వై.పాలెంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు.
ప్రతి సమస్యను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

