వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రజల నుంచి నేరుగా 175 వినతులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావ శ్రమ పడకుండా, రెవెన్యూ డివిజన్ స్థాయిలోని ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

