వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామంలో శనివారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ భారతి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
గ్రామానికి చెందిన 563 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరైనట్లు తహసీల్దార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో కీలకమైనవన్నారు.
Comments
Loading comments...

