Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్నం పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 1:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పట్నం పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ - Udayam
ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్ స్టేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సునీత, పట్నం ఎస్సై మహమ్మద్ అర్షద్‌లను స్టేషన్‌లోని పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు.

Comments

G
Loading comments...