Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు - Udayam
కాలుష్య నియంత్రణ మండళ్ల ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరు శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పర్యావరణ హితంగా మట్టి వినాయక విగ్రహాలు, సహజ రంగులు వాడాలని కమిషనర్ పిలుపునిచ్చారు. డాక్టర్ అన్న మృదుల తేజస్వి విద్యార్థినులకు ఆరోగ్య సూచనలు చేశారు. అనంతరం విజేతలకు మెమొంటోలు, మట్టి ప్రతిమలు అందజేశారు.

Comments

G
Loading comments...