వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించారు.
నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

