Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలయపాలెంలో గ్రామ దీపికల నిరసన

Follow Udayam on Google
Anjali Singh May 28, 2026 4:23 PM ఖమ్మంGeneral
తిరుమలయపాలెంలో గ్రామ దీపికల నిరసన - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో ఐకెపి గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం దీక్షా స్థలిలో గ్రామ దీపికలు చెవిలో పువ్వు పెట్టుకుని, ఒంటి కాలుపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. తమకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి, పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. వీరికి సీఐటీయూతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించారు.

Comments

G
Loading comments...