Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల్లేక పూలను పారబోసిన రైతు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:53 PM మెదక్General
ధరల్లేక పూలను పారబోసిన రైతు - Udayam
దసరా పండుగ వేళ హైదరాబాద్‌లో బంతిపూలకు మంచి ధర వస్తుందనే ఆశతో మహారాష్ట్ర నుంచి తెచ్చిన పూలను, ఆశించిన మద్దతు ధర దక్కకపోవడంతో రైతు సంగారెడ్డి జిల్లా మద్రి వద్ద కాల్వలో పారబోశాడు. రవాణా ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు పక్కన పారబోసిన పూలను చూసిన స్థానికులు ఎగబడి ఆటోలు, ద్విచక్రవాహనాలపై ఎత్తుకెళ్లారు. పండుగ వేళ రైతుకు నష్టం రావడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...