Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం: పైప్‌లైన్ తవ్వకాలపై నిరసన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:19 AM కోనసీమGeneral
ఆత్రేయపురం: పైప్‌లైన్ తవ్వకాలపై నిరసన - Udayam
ఆత్రేయపురం మండలం వెలిచేరు సమీపంలో రాజవరం-పొదలాడ ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలను ఆదివారం గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో పైపులు వేసి రోడ్డును పునరుద్ధరించలేదని స్థానికులు వాపోయారు. మళ్లీ తవ్వకాలు చేపడితే రోడ్డు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్చించిన తర్వాతే పనులు చేపట్టాలని వారు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...