Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరం మార్చి ఆస్తి కొట్టేశారు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 15, 2026 8:55 AM హైదరాబాద్General
అక్షరం మార్చి ఆస్తి కొట్టేశారు - Udayam
సికింద్రాబాద్‌కు చెందిన మోడేపల్లి మాల్యాద్రి అనే వ్యక్తికి అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న 200 గజాల స్థలాన్ని అక్రమార్కులు కొట్టేశారు. బాధితుడి ఇంటి పేరు, తండ్రి పేరులోని ఒక అక్షరాన్ని మార్చి నకిలీ పత్రాలు సృష్టించారు. అధికారులు ఆధార్, చిరునామా పరిశీలించకుండానే పెద్దఅంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ ఏడాది జనవరిలో ఈసీ పరిశీలించడంతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.

Comments

G
Loading comments...