వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రోటీన్ ఉండే బలమైన ఆహారం తీసుకోవాలని దండేపల్లి మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్.మమత కోరారు. రాష్ట్రీయ పోషణ్ మాసం సందర్భంగా బుధవారం దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు చిన్నారులలో పోషకాహార లోపం నివారణ, వైవిధ్య ఆహారం, ప్రోటీన్ ప్రాముఖ్యత తదితర వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త ధర్మయ్య, వార్డు సభ్యులు ఉన్నారు.
Comments
Loading comments...

