వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు పెంపొందించేందుకు సిద్దిపేట పోలీసులు ‘ప్రాజెక్ట్ సిద్ధి’ను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఏఆర్, సివిల్ పోలీసులకు యోగా, కరాటే, ఫిట్‌నెస్‌తో పాటు పలు నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు.
ఒత్తిడి తగ్గించడం, వ్యక్తిగత సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దశలవారీగా అన్ని పోలీసు సిబ్బందికీ శిక్షణ విస్తరిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...
