Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద స్థలాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ కు వినతి

Follow Udayam on Google
Naresh Sep 07, 2026 9:42 PM నిర్మల్General
కుబీర్ మండలంలోని చెరువులు, జలపాతాల వద్ద వరుస ప్రమాదాల నేపథ్యంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పండిత్ జాదవ్ డిమాండ్ చేశారు. డోడర్న ఎల్లమ్మ చెరువు, బ్రహ్మేశ్వర్ జలపాతంలో జరిగిన నలుగురి మృతి ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం భైంసా సబ్‌కలెక్టర్‌ కు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...