Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:16 AM మెదక్General
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ - Udayam
నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట, జక్కపల్లి గ్రామాల రైతులకు తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన రైతులకు గో ఆధారిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే శిక్షణ ఉద్దేశమని తెలిపారు.

Comments

G
Loading comments...