వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పోలీసులు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం. తిరుపతిరావు సువర్ణపురం, ఎస్సై కె. కృష్ణప్రసాద్ పిడిమందస గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు.
సైబర్ నేరాలు, ఆస్తి నేరాల నివారణ, నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

