వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఆ వార్డులోని పలు కాలనీలలో రాత్రి వేళలో వీధి దీపాలు వెలగకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ సూరం చంద్రమౌళి దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ఆయన మున్సిపల్ అధికారులు, విద్యుత్ సిబ్బందితో మాట్లాడి శనివారం మధ్యాహ్నం ఆయా కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు.
Comments
Loading comments...

