వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం పట్టణంలోని భవాని నగర్ కాలనీవాసులు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. కాలనీలో డ్రైనేజీలు, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
వర్షం పడితే రోడ్లు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు నడవడానికి, చిన్నారులు పాఠశాలలకు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని కాలనీవాసులు వాపోయారు.
Comments
Loading comments...

