Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:38 PM వికారాబాద్General
ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి - Udayam
కుల్కచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదర్బార్‌కు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌ సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...