వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ ఏర్పాటు చేసిన వినాయకులను నిమజ్జనం చేసే ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలని సోమవారం ప్రజావాణిలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం చెరువు వద్దకు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బీఆర్ అభినవ్ చందర్, ఎస్ఐ అరుణ్ కుమార్, ఎంపీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

