వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లకు టూటౌన్ సీఐ బి. అప్పల నాయుడు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
రౌడీషీటర్లను ఉద్దేశించి సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారి పై గట్టి నిఘా ఉంటుందని కౌన్సెలింగ్ చేశారు.
Comments
Loading comments...

