Udayam Digital
Menu

ప్రజాప్రతినిధుల కేసులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

Rudhira Nov 20, 2026 12:23 PM హైదరాబాద్General
ప్రజాప్రతినిధుల కేసులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు - Udayam Digital
ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ స్థితిపై స్థాయీ నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 284 కేసుల్లో 15 పరిష్కారం కాగా, 269 పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. సమన్ల జారీలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...