వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో అందజేశారు.
మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

