Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై ఆందోళనకు వెళ్తుంటే అరెస్టులా?

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:13 AM కామరెడ్డిGeneral
ప్రజా సమస్యలపై ఆందోళనకు వెళ్తుంటే అరెస్టులా? - Udayam
నిజాంసాగర్‌ మండలం మంగ్లూర్‌ బీజేపీ సర్పంచ్‌ నర్మల రాజును పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకుని నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనకు వెళ్తున్న సర్పంచ్‌లను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...