వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల జనసేన కోఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు.
సోమవారం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టైగర్ జోన్ రద్దు కోసం భూమాచారి చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మురిమడుగు సత్యసాయినగర్‌లో ఆందోళన చేస్తున్న బాధితులను ఆయన పరామర్శించారు.
Comments
Loading comments...

