Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారిన ఇసుక సమస్య

Follow Udayam on Google
p.g.murthy Aug 11, 2026 8:32 AM మంచిర్యాలGeneral
ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారిన ఇసుక సమస్య - Udayam
జన్నారం మండలంలోని పలు గ్రామాల సర్పంచులకు ఇసుక సమస్య తలనొప్పిగా మారింది. చాలా గ్రామాలలో ఇటీవల రోడ్లు, డ్రైనేజీలు, తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అయితే ఆయా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఇసుక దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్త చేశారు. ఎకో జోన్ కావడంతో సమీప గోదావరి నుండి ఇసుకను తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో అభివృద్ధి పనులు చేపట్టలేక సమస్యను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...