వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాల జిల్లా పర్యటనను పురస్కరించుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడుతో పాటు పలువురు ముఖ్య నేతలను బుధవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.
ఈ చర్యలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిపక్షాల స్వరాలను నొక్కేయడం సరికాదని, పెండింగ్ ప్రాజెక్టులపై తమ సూచనలను స్వీకరించకుండా ఇలా నిర్బంధాలు విధించడాన్ని నిరసిస్తున్నామని నేతలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

