Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 1:03 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రధాన రహదారిపై రైతుల ధర్నా - Udayam
గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజీ వద్ద రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కరెంటు కోతలతో పంట పొలాలు ఎండిపోతున్నాయని, లోవోల్టేజీ సమస్యతో స్టార్టర్లు, మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో గజసింగవరం, దమ్మన్నపేట, గోరంటాల, సముద్రం లింగాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...