Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురికి నీరు, ఇబ్బంది పడుతున్న వాహనదారులు

Follow Udayam on Google
p.g.murthy Jul 31, 2026 3:11 PM మంచిర్యాలGeneral
ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురికి నీరు, ఇబ్బంది పడుతున్న వాహనదారులు - Udayam
జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం అంతా జలమయం అయింది. స్థానిక రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.

Comments

G
Loading comments...