వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని గురువారం ఉదయం అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరిని అలరించారు.
ఈ సందర్భంగా కృష్ణాష్టమి విశిష్టత గురించి పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Loading comments...

