Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:37 AM నిర్మల్ General
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి - Udayam
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, వైద్యసేవల అందుబాటుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...