Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేలకు నిధుల కటకట

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 08, 2026 11:42 AM జోగులాంబ గద్వాల్ General
ఎమ్మెల్యేలకు నిధుల కటకట - Udayam
ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) విడుదల కావడం లేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక, నిధుల లేమితో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.140 కోట్ల నిధులు రావాల్సి ఉండగా సర్కారు నుండి స్పందన లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నా, నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన సాధ్యం కావడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

Comments

G
Loading comments...