వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రకాశం పంతులు బ్రిటిష్ పాలకుల ఎదుట నిర్భయంగా నిలిచిన వ్యక్తి, ఆయన తెలుగువారి ధైర్యసాహసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు.
Comments
Loading comments...

