వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి బాన్సువాడ వర్ని మండలాల మీదుగా రుద్రూర్ వరకు రూ.305 కోట్ల తో 765 డి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 55 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. 70 శాతం మేర పూర్తయ్యాయి.
అయితే, పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన రూ.కోట్ల విలువైన రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా మారుతున్నాయి. పనులు పూర్తికాక ముందే పగుళ్లు తేలుతుండటం నాణ్యతలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది.
Comments
Loading comments...

