వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి: 9వ పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా పోషకాహారం అందించాలని సూచించారు.
ఆరేళ్లలోపు పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా నమోదు చేయించాలని తెలిపారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఎదుగుదల లోపాలున్న పిల్లలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

