వార్తలకు తిరిగి వెళ్లండి

పోరండ్లకు చెందిన రెడ్డి సంఘం సభ్యులు ఎమ్మెల్సీ ఎల్.రమణను కలిసి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు.
స్పందించిన ఎల్.రమణ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో సంఘం అధ్యక్షుడు బేతి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు రంజిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగ మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

