వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

