వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో వైకుంఠ రథం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం గ్రామ శివారులో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసింది.
దాని నిర్వహణను పంచాయతీ అధికారులు చూస్తున్నారు. గ్రామంలో చనిపోయే వారి దహన సంస్కారాలు అక్కడ జరుగుతున్నాయి. అయితే చనిపోయే వారి పార్థివ దేహాలను తరలించేందుకు వాహనాలు లేవు. గతంలో కొందరు వైకుంఠ రథం ఇస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చలేదు.
Comments
Loading comments...

