వార్తలకు తిరిగి వెళ్లండి

మెంటాడ మండలం ఆండ్ర లోతుగెడ్డ, జగన్నాథపురం, చింతలవలస, జయితి, ఇప్పలవలస, చింతాడవలస, కొండలింగాలవలస గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎంపీడీవో విమలకుమారి, డిప్యూటీ ఎంపీడీవో సుదర్శన్ పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

