వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలంలో పోలింగ్ కేంద్రాలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎంపీడీవో రమణబాబు తెలిపారు. బుధవారం రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి, కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.
ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలంలోని 60 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏవో ఇమ్మాన్యుయేల్, రాజకీయ పార్టీల మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

