Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై చిన్నారి ప్రేమ.. రాఖీతో వెలిగిన మానవీయత

Follow Udayam on Google
Muthyam silari Aug 28, 2026 5:02 PM నిర్మల్General
పోలీసులపై చిన్నారి ప్రేమ.. రాఖీతో వెలిగిన మానవీయత - Udayam
ప్రజల రక్షణ కోసం నిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ చిన్నారి అపురూపమైన గౌరవాన్ని చాటింది. దిలావర్ మండలంలో పహారా నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వద్దకు వెళ్లిన చిన్నారి వారికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించింది. పోలీసులను అన్నదమ్ములుగా భావించి చూపిన ఈ ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల పట్ల చిన్నారి చూపిన అభిమానం పలువురి ప్రశంసలు అందుకుంది.

Comments

G
Loading comments...