Udayam Digital
Menu

స్టేషన్‌లోనే మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం

Manjunath Nov 20, 2026 11:06 AM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు తోటి సిబ్బంది ఆత్మీయంగా సీమంతం నిర్వహించారు. మెటర్నిటీ లీవ్‌పై వెళ్తున్న సందర్భంగా సీఐ బి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ వేడుక ఏర్పాటు చేశారు. పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు అందించి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి.

Comments

G
Loading comments...