Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో బాలిక కుటుంబానికి బెదిరింపులు ముగ్గురిపై కేసు

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 6:32 PM ఖమ్మంGeneral
పోక్సో కేసులో బాలిక కుటుంబానికి బెదిరింపులు ముగ్గురిపై కేసు - Udayam
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం నగరంలో ఓ మైనర్ బాలికపై లైంగికదాడి, భవనం పైనుంచి తోసేసిన హత్యాయత్నం కేసులో బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది. నిందితుడు గౌస్ పాషా కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ HYD నిమ్స్ చికిత్స పొందుతున్న బాలికకు ఆయన కుమార్తెలు, కోడలు బెదిరించినట్లు బాలిక తండ్రి పంజాగుట్ట PSలో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...