వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ధరణి కాలనీలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలను బుధవారం, గురువారం రోజుల్లో నిర్వహించనున్నట్లు కాలనీవాసులు తెలిపారు.
బుధవారం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, గురువారం అమ్మవారి లగ్నం, నాగవల్లి, సూర్యబోనం, అగ్ని గుండాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, మొదటి బోనం సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
Comments
Loading comments...

