వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిరాల మండల వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయి. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు అలుగులు పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారీ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంట పొలాలు, పత్తి చేలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

