Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలంలోనే ఆగిన రైతు గుండె

Follow Udayam on Google
K Anuradha Aug 24, 2026 5:02 PM శ్రీకాకుళంGeneral
పొలంలోనే ఆగిన రైతు గుండె - Udayam
మందస(M)జిల్లుండ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. రెండు చేతులతో కుటుంబాన్ని పోషిస్తున్న రౌతు తిరుపతిరావు (35) పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించగా, అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. తిరుపతిరావుకు భార్యతో పాటు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన ఆయన మృతితో కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...