వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో చెత్తను నిల్వ చేసి నిప్పు పెట్టడంతో కొత్త శేషుకొండ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త దహనంతో దట్టమైన పొగ, దుర్వాసన పరిసర ప్రాంతాలను కమ్మేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపించారు.
Comments
Loading comments...

