Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెలలో పోలీస్ సంక్షేమ సంఘం ఎన్నికలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 11:17 AM సూర్యాపేటGeneral
ఈ నెలలో పోలీస్ సంక్షేమ సంఘం ఎన్నికలు - Udayam
జిల్లాలో పోలీస్ సంక్షేమ సంఘం ఎన్నికలు ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్నాయి. 17న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ చేపట్టనున్నారు. సివిల్, ఏఆర్ విభాగాల్లోని 29 స్థానాలకు 1,067 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సివిల్ సిబ్బందికి 19న, ఏఆర్ సిబ్బందికి 20, 21 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...