Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులకు పోలీసుల భద్రతా హెచ్చరిక

Follow Udayam on Google
రవళి దేవి Jun 29, 2026 4:47 PM అనంతపురంGeneral
బ్యాంకులకు పోలీసుల భద్రతా హెచ్చరిక - Udayam
సత్యసాయి జిల్లాలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాచ్‌మెన్‌లను నియమించాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు భద్రతను పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిబంధనలను పాటించని వారిపై చర్యలు ఉంటాయని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...