Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్క సుమన్‌పై పోలీస్ కేసులు నమోదు

Follow Udayam on Google
Priya Singh May 27, 2026 12:44 PM హైదరాబాద్General
బాల్క సుమన్‌పై పోలీస్ కేసులు నమోదు - Udayam
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేలా కార్మికులను రెచ్చగొడుతూ మిలిటెంట్ తరహా చర్యలకు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్క సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఆడియో ఆధారాలను కూడా అందజేశారు.

Comments

G
Loading comments...