Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాస సహస్ర లింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Devender Bale Aug 28, 2026 11:05 PM జగిత్యాలGeneral
పొలాస సహస్ర లింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు - Udayam
పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణమాసం శుక్రవారం, జంధ్యాల పౌర్ణమి సందర్భంగా శివయ్యకు, ముగ్గురు అమ్మవార్లకు పంచామృత అభిషేకం, అష్టోత్తర నామాల పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు, మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు. భక్తుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సంతానం, సకాలంలో వివాహాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారని ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ నలమాస గంగాధర్ తెలియజేశారు.

Comments

G
Loading comments...